ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_MLA_Pratap_Reddy_Came_Out_From_Meeting

ETV Bharat / videos

YCP MLA Pratap Reddy Came Out From Meeting: వైసీపీ సమావేశానికి సస్పెండైన నేత.. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అభ్యంతరం - Nellore Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 9:09 PM IST

YCP MLA Pratap Reddy Came Out From Meeting After Seen Sukumar Reddy:నెల్లూరులో నిర్వహించిన కావలి నియోజకవర్గ అసెంబ్లీ సమీక్ష సమావేశానికి వచ్చిన సుకుమార్ రెడ్డిని చూసి.. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. నగరంలో ఓ కన్వెన్షన్ హాలులో కావలి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుకుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్​ రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. ఈ సమయంలో సుకుమార్​ రెడ్డిని చూసిన ప్రతాప్​ రెడ్డి హాలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ విజయసాయి రెడ్డి.. జరిగిన అంశాన్ని గమనించి ఇద్దరిని కూర్చోపెట్టి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండైన సుకుమార్ రెడ్డి సమావేశానికి రావడం తనకు ఇష్టం లేదని.. అందుకే సమావేశం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయన పార్టీ కార్యకర్తలతో తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను సీఎంను కలిసి వివరిస్తానని వైసీపీ నాయకులతో అన్నారు. ఆయన వెళ్లిపోయే సమయంలో కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించారు. 

ABOUT THE AUTHOR

...view details