ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP MLA Kethireddy Venkatarami Reddy

ETV Bharat / videos

ఎమ్మెల్యే వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు - ఆసుపత్రికి తరలింపు - రోడ్డు యాక్సిడెంట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 1:02 PM IST

 YSRCP MLA Kethireddy Venkatarami Reddy:శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి  తీవ్రంగా గాయాలయ్యాయి. నల్లమడ మండలం కొండ కింద తండాకు చెందిన నారాయణ నాయక్, పీకానాయక్ ద్విచక్ర వాహనంపై కదిరి వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో ముదిగుబ్బ మండలం మొలకవేమల క్రాస్ వద్ద, ధర్మవరం నుంచి కదిరికి వెళుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ఎస్కార్ట్​ వాహనం వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నారాయణ నాయక్, పీకానాయక్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్కార్ట్ వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వైద్యులు గాయపడిన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద విషయం తెలుసుకున్న నారాయణ, నాయక్ పీకానాయక్ కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details