YCP MLA in Gadapa Gadapaku Program అసమ్మతి వర్గపోరులో గడపగడపకు వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ తరువాత ఏమైందంటే ? - ఎమ్మెల్యేపై తిరుగుబాటు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 10:23 PM IST
|Updated : Oct 26, 2023, 6:28 AM IST
Gadapa Gadapaku Program: వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం బాల రాజు పల్లె గ్రామంలో ఎమ్మెల్యే సుధకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి సొంత మండలంలో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన వైసీపీ నాయకుడు విశ్వనాథరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మధ్య కొంతకాలంగా వర్గ బేధాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డితో కలిసి గడపగడపకు ప్రోగ్రాం నిర్వహించారు. ఎమ్మెల్యే సాయంత్రం మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు గ్రామంలో గడపగడప కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తుందన్న ఈ విషయం తెలుసుకున్న విశ్వనాథరెడ్డి వర్గీయులు ఇళ్లకు తాళాలను వేసి వెళ్లిపోయారు. సుమారు 150 ఇల్లు ఉన్న ఈ గ్రామంలో వృద్ధులు కొంతమంది మహిళలు మాత్రమే ఉన్నారు. గ్రామం లో రహదారులు ఇతర సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధా జగనన్న 20 లక్షలు నిధులు ఇచ్చారని ఈ నిధులనుగ్రామ సచివాలయనకి కేటాయించామని ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గ్రామస్థులకు నచ్చజెప్పె ప్రయత్నం చేశారు.