ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP MLA Gorle Kiran Kumar Tirumala Darshan

ETV Bharat / videos

YCP MLA Gorle Kiran Kumar Tirumala Darshan: అధికార పార్టీ నేతలా.. మజాకా..! 92 మంది అనుచరులతో ఎమ్మెల్యే వీఐపీ బ్రేక్ దర్శనం - 92 మందితో తిరుమలకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 2:54 PM IST

YCP MLA Gorle Kiran Kumar Tirumala Darshan: తిరుమలలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. భారీగా అనుచరులను, కార్యకర్తలను వెంటపెట్టుకొని వచ్చి.. వైఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ తితిదేపైన ఒత్తిడి చేస్తున్నారు. దీని కారణంగా సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ నేత ఏకంగా 92 మందిని వెంటబెట్టుకొని వచ్చారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ 92 అనుచర వర్గంతో వీఐపీ బ్రేక్ (VIP) దర్శనానికి వెళ్లారు. దర్శన అనంతరం అనుచరులతో బయటకు వచ్చిన ఎమ్మెల్యే .. కాసేపు హంగామా సృష్టించారు. ఎమ్మెల్యేతో పాటు 92 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడంపై సామాన్య భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంతో సైతం వైసీపీ మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఉషశ్రీ చరణ్ ఇదే విధంగా తి.తి.దే. పై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలు ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details