ఆ విషయంలో జగన్ బిజీగా ఉన్నారు: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 4:18 PM IST
YCP MLA Chennakesava Reddy Sensational Comments on CM Jagan:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు(MLA Chennakesava Reddy Comments on Jagan) చేశారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు కృషి చేయాలంటూ ర్యాలీగా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కార్మికుల వేతనం పెంపుపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల కోసం టికెట్ల కేటాయింపు, డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలనే విషయాల్లో సీఎం జగన్ బిజీగా ఉన్నారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వారితో అన్నారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను తీర్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మిగనూరు టికెట్ వచ్చే ఎన్నికల్లో బీసీకి ఇస్తున్నట్లు వైసీపీ పెద్దలు చెప్పడంతోనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారన్న వాదవ వినిపిస్తోంది.