మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి - ఆసుపత్రిలో చికిత్స - తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 10:19 PM IST
Minister Venugopala Krishna hospitalized after heart pain: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో.. విజయవాడ ప్రభుత్వాస్పత్రి (Vijayawada Government Hospital) కి వెళ్లిన మంత్రికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మెరుగైన వైద్య పరీక్షల కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మణిపాల@కు వచ్చిన మంత్రికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
24 గంటల పరిశీలనలో ఉండాలని వైద్యులు సూచించినట్లు వైసీపీ నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి (Manipal Hospital) లో చేరిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మంత్రి 24 గంటలపాటు వైద్యుల పరిశీలనలో ఉండనున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోగ్యంపై వైసీపీ నేతలు స్పందించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ (CM Jagan) ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందేలా.. చూడాలని వైద్యులకు సూచించారు.