YCP secret meeting: కార్యకర్తలతో మంత్రి పెద్దిరెడ్డి రహస్య సమావేశం.. అందుకేనా..! - YCP secret meeting in Anantapur
YCP secret meeting in Anantapur: అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల కార్యకర్తలతో మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది. అనంతపురం గ్రామీణ నారాయణపురం పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్లో ఈ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల్లోని అసమ్మతి కార్యకర్తలను పిలిపించి వారితో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని అసమ్మతి కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఇప్పటి నుంచి రానున్న ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కలిసి పనిచేసే పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అసమ్మతి వీడనాటి కలిసి పని చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీడియాను అనుమతించకుండా అడుగడుగునా పోలీసులను కాపలా పెట్టి వారి కార్యకర్తలను కాకుండా ఎవరిని లోనికి అనుమతించడం లేదు. ఇదంతా నారాయణపురం పంచాయతీ పరిధిలోని వైసీపీ యువజన విభాగం నాయకుడు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ వద్ద జరుగుతోంది.