ప్రైవేట్ వెంచర్ నిర్మించిన సిమెంట్ రోడ్డును ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు - పల్నాడు తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 11:53 AM IST
YCP Leadesrs Road Damage in Palnadu : వైసీపీ నాయకుల దుర్మార్గం పరాకాష్టకి చేరింది. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే దారిలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ వారు నిర్మించిన సిమెంట్ రోడ్డును వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. అయితే వైసీపీకి చెందిన కొందరు ప్రధాన రహదారి నిర్మించిన స్థలం తమదనీ కొంతకాలంగా రియల్టర్లను బెదిరిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి వైసీపీ నాయకులు ప్రొక్లెయిన్ తో రోడ్డును ధ్వంసం చేశారు. వెంచర్ వ్యాపారులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూమి ఎవరిది అనే విషయం పై స్థానిక తహసీల్దారు సర్వే చేయాలని పట్టణ సీఐ ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత నేరం చేసిన వారి పై చర్యలు చేపడుతామని తెలిపారు.
YCP Leaders Destroyed Cement Road Built by Private Venture : అధికార పార్టీ అండతో దౌర్జన్యంగా ప్రవర్తించడం భావ్యం కాదని బాధితులు వాపోయారు. అసలు ప్రొక్లెయినర్తో రోడ్డు ధ్వంసం చెయ్యాల్సిన అవసరమేంటని నిలదీశారు. చేసేదేంలేక పోలీసులకు విషయం వివరించారు. సర్వే నిర్వహించిన తరువాత ఈ ఘటన పై చర్యలు తీసుకుమంటామన్నారు పోలీసులు.