YCP Leaders Vs SEB Officials in Sri Sathya Sai District: అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ను అడ్డుకున్న సెబ్ అధికారులు.. వైసీపీ నాయకుల వాగ్వాదం - YCP leaders sand transport in Sathyasai district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 1:49 PM IST
YCP Leaders Stopped SEB Officials:అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని జప్తు చేయడానికి వెళ్లిన సెబ్ (SEB) అధికారులను వైసీపీ నాయకులు అడ్డుకొని అధికారుల విధులకు అడ్డుపడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం జయ మంగలి నది నుంచి ట్రాక్టర్ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో హిందూపురం సెబ్ అధికారులు మాటు వేశారు. నది నుంచి ఇసుకతో వస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.. తమ వద్ద అనుమతి పత్రం ఉందంటూ ఫోర్జరీ సంతకాలతో ఉన్న పేపర్లను చూపించారు. అధికారులు ఒప్పుకోకపోవడంతో ట్రాక్టర్ని స్టేషన్కు తరలిస్తామని నమ్మబలికి.. ఇసుకను మరోచోట తరలించి ఖాళీ వాహనాన్ని స్టేషన్కు తరలించారు. వైసీపీ నాయకులు రోడ్డుపై అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనను అక్కడి స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మధ్యమాలలో ప్రచారం చేశారు. తమ విధులకు భంగం కలిగేలా వైసీపీ నాయకులు వ్యవహరించారని సెబ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.