నాలుగేళ్లుగా కనిపించని సమస్యలు - బస్సుయాత్ర కోసం రోడ్లకు మరమ్మతులు - roads repair in bus yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 2:07 PM IST
YCP Leaders Repairing Roads For Bus Yatra in Vizianagaram District: విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని వైసీపీ నాయకులకు, అధికారులకు నాలుగేళ్లగా కనిపించని సమస్యలు ఇప్పుడే గుర్తొచ్చాయాని ప్రజలు విమర్శిస్తున్నారు. వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర జరగనున్న నేపథ్యంలో..రెండు రోజులుగా గుంతలను పూడ్చివేస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రలో భాగంగా పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో మంత్రులు, నాయకులకు భోజనాలను ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లేందుకు వీలుగా ఆగమేఘాల మీద ఆ రహదారిని ఏపీఐఐసీ అధికారులు దగ్గరే ఉండి పూర్తి చేయించారు. గుంతల్లో బస్సు కూరికిపోతే ఇబ్బంది ఎదురవుతుందని ఉద్దేశంతో ముందుగానే రోడ్లని పూడుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మిగతా రోడ్లలో ఉన్న గుంతలను నెమ్మదిగా పూడ్చుతున్నారు.
అధికార పార్టీ నాయకులు, ముఖ్యులు వెళ్లేందుకు వీలుగా ఆ రహదారిని బాగు చేయడం పట్ల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. మిగిలిన రహదారులు కూడా మోకాలు లోతు గోతులు ఉన్నా వాటిపై అంతగా స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహనికి గురవుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని చాలా రహదారులు పాడైన బస్సు తిరిగే మార్గంలోనే గుంతలు పూడ్చటం స్వార్థమే అని ప్రజలు మండిపడుతున్నారు.