ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_Leaders_Harrasement_in_Guntur

ETV Bharat / videos

అద్దె కట్టాలని వైసీపీ నేతల ఆగడాలు - నడిరోడ్డుపై చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం - tenali women commit suiciode

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 4:52 PM IST

YCP Leaders Harrasement in Guntur: అధికార పార్టీ అండ చూసుకుని వైసీపీ నేతల(YCP Leaders) ఆగడాలు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ కుటుంబం రోడ్డున పడింది. టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న మహిళ అద్దె చెల్లించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం(suicide Attempt) చేసింది.

Family Commit Suicide Attempt Tenali: తెనాలి శివాజీ చౌక్ వద్ద నాదెండ్ల లక్ష్మి అనే మహిళ పది సంవత్సరాలకు పైగా టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే ఇటీవల టిఫిన్ బండి చుట్టూ వైసీపీ నేతల ప్రోద్బలంతో ఆటోలు పెట్టిస్తున్నారని బాధిత మహిళ లక్ష్మి వాపోయారు. దీనిపై అడిగితే అక్కడ బండి పెట్టుకున్నందుకు రూ.12వేలు అద్దె చెల్లించాలని వైసీపీ నేత తాడిబోయిన రమేష్, 5వార్డ్ కౌన్సిలర్ తోట రఘురాం డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవటంతో మున్సిపల్ సిబ్బందితో టిఫిన్ బండిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కుటుంబ సభ్యులతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగి.. శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మితో సహా కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. శివాజీ చౌక్ వద్ద చాలా ఉన్నాయని.. అన్ని బండ్లకు లేని ఇబ్బంది తమబండికే వచ్చిందా అని లక్ష్మి ప్రశ్నించారు. తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details