ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Field Assistant Viral Audio

ETV Bharat / videos

వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు.. ఆత్మహత్యే శరణ్యమంటున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్.. ఆడియో లీక్​ - AP Latest News

By

Published : Apr 3, 2023, 10:06 AM IST

రాష్ట్రంలో వైసీపీ నేతల దాష్టికాలకు అంతు అనేది లేకుండా పోతుంది. తాజాగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్​ను వైసీపీ నేతల వేధింపులకు గురి చేయగా ప్రస్తుతం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ షాజహాన్.. తనను వైసీపీ నేతలు.. ఎంపీటీసీ మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ సురేష్​లు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల అవసరాల కోసం అప్పు తెచ్చి రూ. 13 లక్షలు వైసీపీ నేతలకు ఇచ్చినట్లు చెబుతున్నాడు. అయితే ఇన్ని రోజులు తన చేత అన్ని పనులు చేయించుకుని.. తీరా ఇప్పుడు తాను ఇచ్చిన రూ. 13 లక్షల అడిగితే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని.. బాధితుడు షాజహాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఇంకా చేసేది ఏమీ లేదని.. ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ABOUT THE AUTHOR

...view details