'వైఎస్సార్సీపీలో వర్గపోరు' భూమిని విక్రయించి అరటి పంట ధ్వంసం - కౌలు రైతు ఆవేదన - వైఎస్సార్సీపీ పార్టీ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 1:32 PM IST
YCP Leaders Destroyed The Farmer Banana Crop In Nandyal: నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో కౌలు భూమిలో సాగుచేసిన అరటి పంటను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని కౌలు రైతు రమణ వాపోయాడు. ఆ భూమిని రమణ మూడు సంవత్సరాలకు కౌలుకు తీసుకున్నాడు. కానీ ఆ భూమి యజమాని మరొకరికి విక్రయించాడు. దీంతో భూమి కొనుగోలు చేసిన వీరారెడ్డి, పావని కొంతమంది అనుచరులతో కలిసి వచ్చి అరటి తోటను నరికి వేసినట్లు కౌలు రైతు పేర్కొన్నాడు. వైసీపీ నేత నాగ భూపాల్ రెడ్డితో కలిసి తిరుగుతున్నాననే కారణంతో తన పంటను మరో వైసీపీ నేత వీరారెడ్డి ధ్వంసం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు కోరుతున్నారు.
భూమిని మూడు సంవత్సరాలకు కౌలుకు తీసుకున్నాను. మొత్తం పంటను వీరారెడ్డి, పావని బంధువులు నాశనం చేశారు. ఇంతకుముందు మమ్మల్ని చంపుతామని బెదిరించారు. ఒకసారి పొలంలో ఉన్న కరెంటుతో కూడా చంపేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయమని పోలీసులకు చెబితే వాళ్లు మీ భూమి సమస్య కోర్టులో ఉంది కాబట్టి పంచాయతీలోనే తేల్చుకోవాలని చెప్పారు. పంట నష్టం జరిగిందని చెబితే మాకు తెలియదని కేసు నమోదు చేయలేదు. - రమణ,కౌలు రైతు