ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_remove_tdp_votes

ETV Bharat / videos

YCP Leaders Conspired to Remove TDP Sympathizers Votes: రాష్ట్రంలో 2లక్షల 45వేల ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఏలూరి - Eluri Sambasivarao Allegations on votes deletion

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 2:25 PM IST

YCP Leaders Conspired to Remove TDP Sympathizers Votes:రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 25 వేల మంది తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నారని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టైన వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7లు అప్​లోడ్​ చేశారని ధ్వజమెత్తారు. అదే సమయంలో కొత్త ఓట్లు చేరికలకు దాదాపు 1.20లక్షలు ఫామ్-6లు పెట్టారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేసి.. వైసీపీ అనుకూల వ్యక్తులకు 4-5 చోట్ల ఓటు హక్కు కల్పించేలా ఫామ్-6లు పెట్టారని మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు ఎదురు చూస్తుంటే, అక్రమ ఓట్ల ద్వారా మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. 

కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు మొట్టికాయలు వేస్తోంది కాబట్టి పర్చూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారిని వీఆర్​లో పెట్టి సరిపెట్టారని ధ్వజమెత్తారు. 189 మంది కుట్రలో భాగస్వాములు అయితే కేవలం 12 మందిపై చర్యలు తీసుకున్నారని ఆక్షేపించారు. తప్పు చేసిన అధికారుల్ని సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేవరకూ విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details