YCP Leaders Clash in front of Vijayasai Reddy: వైసీపీ ఎమ్మెల్యే తీరుపై అధికార పార్టీ ఎంపీపీ ఆగ్రహం..అంతా విజయసాయిరెడ్డి ముందే.. - ఏపీ లెటెేస్ట్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 7:51 PM IST
YCP Leaders Clash in front of Vijayasai Reddy: ప్రకాంశం జిల్లా సంతనూతలపాడు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి ముందే సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల సమీక్షలో వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఎంపీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వల్ల గ్రామాల్లో పార్టీ మూడు వర్గాలుగా చీలిందన్నారు. ఎంపీపీ అంజమ్మ వ్యాఖ్యలతో ఎమ్మెల్యే వర్గీయుడు విజయకుమార్ ఆగ్రహానికి గురయ్యాడు. అంజమ్మను పక్కకు నెట్టేశాడు. ప్రతిఘటించిన ఎంపీపీ విజయకుమార్ చెంప చెళ్లుమనిపించారు.
విజయసాయిరెడ్డి ముందే రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. అనంతరం మాట్లాడిన ఎంపీపీ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో అమాయకుల నుంచి లక్షలు వసులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో రౌడీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే వర్గీయులు భేటీ నుంచి వెళ్లిపోయి హోటల్ గదుల్లో తాళాలు వేసుకున్నారు. సమావేంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అనుచరులు వ్యవహరించిన తీరుపై పలువురు నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు.