Police Fire on JAC Leaders: 'మేడంకు సమస్యలు ఎప్పుడు చెప్పాలో తెలీదా..ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తా' - JAC leaders complaint for tehsildar to padmavathi
YSRCP Leaders Brutality Against JAC Leaders in Anantapur : అనంతపురంలోనిఆర్డీవోకార్యాలయం వద్ద సింగనమలఎమ్మెల్యేజొన్నలగడ్డ పద్మావతికి చేదు అనుభవం ఎదురైంది. గూగూడు కుల్లాయి స్వామి జాతర విషయమై కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేముందుఎస్సీ, ఎస్టీ, జేఏసీనాయకులు సమస్యల చిట్టా విప్పారు. బుక్కరాయ సముద్రం తహసీల్దార్ అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదు చేశారు.
దీంతో ఎమ్మెల్యే అనుచరులు, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. 'మేడంకు సమస్యలు ఎప్పుడు చెప్పాలో తెలీదా' అంటూ దళిత సంఘాల నేతలపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేవెళ్లిపోయిన తర్వాత ఆమె అనుచరులుఎస్సీ, ఎస్టీ జేఏసీనేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్ధి చేప్పాల్సింది పోయి..ఎస్సీ, ఎస్టీ జేఏసీనేతలను దూషించారు. 'ఎక్కువ మాట్లాడితే తోలు తీస్తా, స్టేషన్కు పదా నీ కథ చూస్తాం' అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.