ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_leaders_attacked_tdp_leaders

ETV Bharat / videos

YCP Leaders Attacked TDP Leaders: పోలీసుల ఎదుటే వైసీపీ నేతలు టీడీపీ మద్దతుదారు కుటుంబంపై రాళ్ల దాడి.. ఐదుగురికి గాయాలు - YCP leaders Anarchy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 12:09 PM IST

YCP Leaders Attacked TDP Leaders: తెలుగుదేశం నేతలపై వైసీపీ శ్రేణులు పోలీసుల ఎదుటే దాడి చేసిన ఘటన సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని బత్తలపల్లి మండలం వెంకటగారి పల్లెలో టీడీపీ మద్దతుదారు ముత్తులూరి బాబు కుటుంబ సభ్యులపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముత్తులూరు బాబు గ్రామంలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం నేటికీ చెల్లించలేదు. ఆ భవనానికి సంబంధించిన తాళాలు బాబు వద్ద ఉన్నాయి. ఆ కమ్యూనిటీ భవన తాళాల కోసం వైసీపీ నేతలు బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు గ్రామానికి రాగా వారికి తాళాలు ఇచ్చేందుకు బాబు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు హరి మరికొంత మంది కలిసి.. బాబు కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దాడిలో బాబు అతని సోదరులు నాగరాజు, నాగభూషణ, కుటుంబ సభ్యులు సుజాత, సుకన్య గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details