దొంగ, డబ్లింగ్ ఓట్లు పరిశీలిస్తున్న టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నేతల దాడి - nellore YCP Leaders Attack on TDP Leaders
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 5:48 PM IST
YCP Leaders Attacked on TDP Leaders for Conducting Voter Survey: తెలుగుదేశం తరఫున దొంగ (Bogus), డబ్లింగ్(Doubling) ఓట్లపై సర్వే చేస్తున్న వ్యక్తులపై వైసీపీ (YCP) నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోటమిట్ట ప్రాంతంలో ఓటరు సర్వే చేస్తున్న వ్యక్తిపై స్థానిక వైసీపీ నేతలు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఓటరు సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఫోన్ నంబర్లు తీసుకుని ఓటీపీ (OTP)లు అడుగుతున్నారని ఆరోపించారు.
YCP Leaders Attack in Nellore: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు పరిశీలన చేసి.. దొంగ ఓట్లు, డబ్లింగ్ ఓట్లు ఉంటే గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని కోటమిట్ట ఖుద్ధుస్ నగర్ ప్రాంతంలో ఓటరు సర్వే చేస్తున్న వ్యక్తులపై స్థానిక అధికార పార్టీ నేతలు దాడి చేశారు. ఓటరు వ్యక్తిగత సమాచారం సేకరించడమే కాకుండా ఓటీపీలను సైతం అడుగుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓటరు సర్వే చేస్తున్న వ్యక్తులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం మూలపేట కొండదిబ్బ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.