YCP Leaders Attacked Dalits in Ganesh immersion వినాయక నిమజ్జనంలో వాగ్వాదం .. దళితులపై దాడి చేసిన వైసీపీ నేతలు - అనంతపురం జిల్లాలో దళితులపై దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 10:56 PM IST
YCP Leaders Attacked Dalits in Ganesh immersion: వైసీపీ నేతలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. గ్రామాల్లో సైతం నేతలు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నచందంగా ప్రవర్తిస్తున్నారు. తమకు అడ్డువచ్చిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తునే ఉన్నాం. తాజాగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పసులూరులో వినాయక నిమజ్జనానికి వెళుతున్న దళితులపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అకారణంగా తమపై వైసీపీ నాయుకులు దాడి చేశారంటూ దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వినాయక చెవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్టించుకున్నామని.. ఈ రోజు నిమజ్జనం కోసం సుంకులమ్మ ఆలయం చుట్టూ గణేశుడి ప్రదక్షిణ చేయిస్తుండగా... తమపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఎస్సీలు వాపోయారు. ఈ దాడిని దళితులు ప్రతిఘటించడంతో ఘర్షణ తీవ్రమయ్యేలా కనిపించింది. అయితే, గొడవలు జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్పటికే అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణపడుతున్న నేపథ్యంలో దళిత వర్గానికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమపై దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని దళితులు పట్టుబట్టారు. గ్రామంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పసులూరులో పోలీసుల ముందస్తుగా భద్రత పెంచారు.