YCP Leaders Attack on TDP Workers : ఆదోనిలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తల దాడి - Clash breaks between TDP YSRCP workers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 11:26 AM IST
YCP Leaders Attack on TDP Workers : రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికారం చేపట్టినప్పటి నుంచి టీడీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆదోనిలోని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలోనూ వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను టీడీపీ నేత ఉమాపతి నాయుడు పరామర్శించారు..
ఇటీవల రాష్ట్రంలో టీడీపీ నేతలపై అధికార వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. గత వారం గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెలుగు దేశం పార్టీ దీక్షా శిబిరంపై రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ 10 రోజులుగా అడ్డరోడ్డు వద్ద టీడీపీ నేతలు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలు ముగించి వెళ్లే సమయంలో అటుగా వైసీపీ నేతలు వినాయక నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఊరేగింపు తాడికొండ అడ్డరోడ్డు వద్దకు వచ్చిన తర్వాత అక్కడ టీడీపీ శ్రేణుల్ని చూసి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శిబిరంపై రాళ్లదాడికి దిగారు.