ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_Leaders_Attack_on_TDP_Leader

ETV Bharat / videos

YCP Leaders Attack on TDP Leader in Dharmavaram: ధర్మవరంలో టీడీపీ నాయకుడిపై వైసీపీ వర్గీయుల దాడి.. అలా పోస్టింగ్​ పెట్టినందుకు..! - టీడీపీ నేత కత్తుల బాబ్జిపై వైసీపీ వర్గీయులు దాడి

By

Published : Aug 16, 2023, 10:12 AM IST

YCP Leaders Attack on TDP Leader in Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గీతానగర్‌లో తెలుగుదేశం పార్టీ నాయకుడు కత్తుల బాబ్జిపై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రపై వైసీపీకు చెందిన వారు అనుచిత పోస్టింగ్ చేశారు. అందుకు బదులుగా పరిటాల రవీంద్ర ఉన్నప్పుడే ధర్మవరం పట్టణం ప్రశాంతంగా ఉందని కత్తుల బాబ్జి పోస్టింగ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామిరెడ్డి వర్గీయులు కత్తుల బాబ్జి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాబ్జి భార్య సునీత గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియడంతో భారీ సంఖ్యలో బాబ్జి ఇంటి వద్దకు చేరుకొని వైసీపీ వర్గీయులను బాబ్జి ఇంటి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఇరువర్గాలు మొహరించడంతో ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ వర్గీయులను అక్కడ నుంచి పంపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు... పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. బాబ్జి, ఆయన భార్య సునీత వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details