వైసీపీలో ముదురుతున్న వర్గపోరు- మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై ఓ వర్గం ఆగ్రహం - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 5:28 PM IST
YCP Leaders Angry on Minister Adimulapu Suresh:మంత్రి ఆదిమూలపు సురేష్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు రాగా వారికి మంత్రిని కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంగోలులో క్యాంప్ ఆఫీస్‌లో న్యూ ఇయర్ వేడుకలను మంత్రి ఏర్పాటు చేశారు. కొండేపి, ఎర్రగొండపాలెం నుంచి పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు వచ్చారు.
ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ పరిధిలో ఉన్న సింగరాయకొండ ముప్ప మండల అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి తన వర్గంతో క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. అయితే ఆయన్ను మంత్రిని కలిసేందుకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆగ్రహించిన రవికుమార్ రెడ్డి వర్గం అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయారు. కొండేపి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన మంత్రి సురేష్ అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వకుండా కొందరికే ఇస్తున్నారని ఆగ్రహించారు.సెక్యూరిటీ సిబ్బంది వైసీపీ నాయకులు వచ్చి వీళ్లను బ్రతిమిలాడినా వినలేదు. సింగరాయకొండకు చెందిన అశోక్ రెడ్డి వర్గానికి కలిసేందుకు ముందుగా అవకాశం ఇచ్చారని తామను మాత్రం ఇందులో తక్కువగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.