ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_Leader_Halchal_in_Potladurthi

ETV Bharat / videos

నేనేవరో తెలుసా! ఈ బ్యాంక్‌ను కూల్చివేస్తా - పోలీస్ స్టేషన్‌లో అడగండి నా గురించి చెబుతారు! వైసీపీ నేత చిందులు - YCP Leader Halchal in Potladurthi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 4:30 PM IST

Updated : Nov 11, 2023, 5:50 PM IST

YCP Leader Halchal in Potladurthi:రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బెదిరింపులకు.. అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమ దందాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వారిపై దాడుల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. తీసుకున్న రుణం తిరిగి కట్టాలని కోరిన బ్యాంకు సిబ్బందిపై.. అధికార పార్టీ నేత తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 'నన్నే రుణం తిరిగి కట్టమంటావా..! నాతో పెట్టుకుంటే బ్యాంక్‌ని కూల్చేస్తా' అంటూ చిందులు తొక్కారు. వైసీపీ నేత బ్యాంక్ సిబ్బందిని బెదిరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Video Viral on Social Media: వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో స్థానిక వైసీపీ నేత హల్‌చల్ చేశారు. రుణం చెల్లించాలని అడిగినందుకు.. బ్యాంక్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. 'నేనేవరో తెలుసా, నా గురించి ఏమనుకుంటున్నారు, అవసరమైతే ఈ బ్యాంక్‌ను కూల్చివేస్తా.. పొట్లదుర్తిలో, పోలీస్ స్టేషన్‌లో, జిల్లాలో ఎక్కడైనా నా గురించి అడిగి తెలుసుకోండి, నేను మంచివాడిని కాను.' అంటూ బెదిరింపునకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటు జిల్లాలో, అటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Last Updated : Nov 11, 2023, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details