YCP leader distributes liquor and chicken: తొందరపడి వైసీపీ కోడి ముందే కూసింది..! ఔరా.. ఇదేమి చోద్యం అంటున్న జనాలు.. - వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 24, 2023, 10:28 PM IST
YCP leader distributes liquor and chicken: ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ కోడి ముందే కూసింది. ఇప్పటి నుంచే జనాలను తమవైపు లాగే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు.. అందుకోసం సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖలో ఓటర్ మహాశయులను ప్రసనం చేసుకునే పనిలో భాగంగా.. ఓ నేత చేసిన ఘనకార్యం జనాలను విస్తుపోయేలా చేసింది. ఇందు కోసం దసరా పండుగను వారు వేదికగా చేసుకున్న వైనం.. ఔర అనిపిస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒకొక్కరికి ఒక కోడి, ఓ క్వార్టర్ మద్యం సీసాతో జనాలను ఖుషి చేశారు. అంతే కాదు.. అవేవో ఏదో ఘనకార్యం సాధింనట్లుగా.. కెమెరాలకు పోజులిస్తూ.. మరీ తమ పార్టీ ప్రచారాన్ని పీక్ కు తీసుకెళ్లారు. దసరా సందర్భంగా అంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అనుచరుడు 31 వ డివిజన్ వైసీపీ నాయకుడు దొడ్డి బాపు ఆనంద్ ఎన్నికలకు ముందే జనాలకు తాయిలాలు ఇస్తూ.. ఖుషీ అయ్ పోయారు..!
తమ పార్టీ కార్యకర్తలకు కోడి, మద్యం సీసా పంపిణీ చేశారు. స్వామి భక్తి చాటుకుంటూ వెనుక వాసుపల్లి గణేష్ కుమార్ ఫ్లెక్సీ పెట్టి మరీ పంచారు. జనం జై జై బాపు ఆనంద్ అంటూ కోడి, మద్యం సీసా తీసుకున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టి మరీ నాయకులు పార్టీ ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందటానికి ఇప్పటినుంచే తాయిలాలు పంచుతున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అయితే, సామన్యంగా ఏపీలో మద్యం కొనాలంటే ఒక వ్యక్తి మెుతాదుకు మించి అమ్మకుడదనే నిబందనలు ఉన్నాయి. అయినా.. పంచి పెట్టెందుకు అన్ని మందు బాటిల్స్ ఇవ్వడం పలు విమర్శలకు దారితిస్తోంది.