YCP leader attacked girl: ప్రశ్నిస్తే దాడులే..! బాలికపై దాడి చేసిన వైసీపీ నేత.. కేసుకు వెనుకాడుతున్న పోలీసులు - వైసీపీ నేత దాడి
YCP leader attacked girl: అధికార వైసీపీ నేతలు బరితెగిస్తున్నారనేందుకు పల్నాడు జిల్లాలో జరిగిన ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. వైసీపీ నేతకు చెందిన ఎద్దులు తమ పాకలోకి రావడంపై ప్రశ్నించిన ఓ కుటుంబాన్ని మరో నలుగురితో కలిసి వైసీపీ నేత చితకబాదాడు. ఇదిలా ఉండగా.. నిందితులపై కేసు నమోదు చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఓ బాలిక పై వైఎస్సార్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ దాడి చేసి గాయపర్చాడు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని బోదిలవిడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరుడు మామిళ్ల పల్లి కోటయ్య కుటుంబంపై వైసీపీ నేత కృష్ణమూర్తి దాడి చేశాడు. కృష్ణమూర్తి కి చెందిన ఎద్దులు తమ పాక లోకి రావడంతో కోటయ్య కుటుంబం నిలదీసింది. దీంతో కృష్ణమూర్తి మరో నలుగురితో కలిసి కోటయ్య కుటుంబం పై దాడి చేశాడు. ఈ దాడిలో కోటయ్య చిన్న కుమార్తె సునీత కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సునీత ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కృష్ణమూర్తి వైసీపీ నేత కావడంతో.. కేసు నమోదు విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.