ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_government_attacks_bcs_in_tdp_leader

ETV Bharat / videos

'రెడ్డి నాయకులదే రాజ్యం - వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లుగా బీసీలపై దాడులు' : కూన రవికుమార్ - andhra pradesh political news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 2:57 PM IST

TDP Leader Says YCP Government Attacks In BC'S:వైసీపీ పాలనలో పేరుకు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారని పాలనలో వారి ప్రమేయం లేదని రాష్ట్రంలో రెడ్డి నాయకులే రాజ్యం ఏలుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలపై దాడులకు తెగబడటమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మొత్తం 13 జిల్లాలను ఐదు ప్రాంతాలుగా విభజించి రెడ్డి నాయకులే పాలిస్తున్నారని విమర్శించారు. 

టీడీపీ బీసీ మహిళా నేతలపై కేసులు పెట్టిన ఘనుడు అన్న జగన్మోహన్ రెడ్డి.. బీసీలకు మేలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా  ఉందని రవికుమార్ అన్నారు. బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని అన్నారు. బీసీలకు ఎప్పుడు చంద్రబాబు అండగా ఉంటారని..అధికార పార్టీ నేతలు అక్రమంగా చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. జగన్‌ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలో పలుచోట్ల తెదేపా నేతలు మీడియా సమావేశాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details