YCP followers Joins TDP in Pulivendula : టీడీపీలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు.. వైసీపీ అరాచకాలే కారణం : బీటెక్ రవి - పులివెందుల లోకల్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 2:23 PM IST
YCP followers Joins TDP in Pulivendula : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలోకి చేరారు. చక్రాయపేట మండలంలోని కుప్పం, బురుజు పల్లి, కొప్పలవాండ్లపల్లె గ్రామాల నుంచి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి చేరారు. వైసీపీ అరాచకాలను భరించలేకే స్వంత పార్టీ కార్యకర్తలే టీడీపీలోకి వచ్చారని బీటెక్ రవి అన్నారు.
భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో భాగంగా బీటెక్ రవి చక్రాయపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. జగన్ పరిపాలను చూసి ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని అందరూ భావిస్తున్నారని అందుకే ఈ వలసలు ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో ఉన్న నిరుద్యోగులు.. మహిళలు.. వృద్ధులు.. రైతులకు కలిపి సుమారు లక్ష రూపాయలు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.