చివరకు ప్రార్థన మందిరాలను వదలరా - వైసీపీ రంగుల రాజకీయం ప్రచారం పిచ్చి పీక్ - YCP Flexi Politics in Sri Sathya Sai District
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 2:56 PM IST
YCP Flexi Politics in Sri Sathya Sai District : ఆంధ్రప్రదేశ్లో అధికర వైసీపీ పార్టీ ప్రచారాల పిచ్చి పీక్ చేరింది. శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ ప్రార్థన మందిరం సముదాయం ఉంది. అందులోని గదులకు మా నమ్మకం నువ్వే జగనన్న అని రాసి ఉన్న ఫ్లెక్సీ బోర్డులను కట్టి ఉంచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహించాల్సిన మందిర ఆవరణలో రాజకీయ ప్రచారాలు ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోకడకు ముగింపు పలకాలని పలువురు సూచిస్తున్నారు.
ప్రజాధనంతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి సైతం వైసీపీ రంగులు అద్దుతున్నారు. పాఠశాల విద్యార్థులకు అందించే విద్యా కానుక నుంచి, ప్రతిరోజు వీధిలో తిరిగి చెత్త సేకరించే చెత్త వాహనాల వరకు రాష్ట్రంలో ఇదే రకమైన వైసీపీ రంగుల రాజకీయం నడుస్తుంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదనే రీతిలో ప్రచారాలు చేస్తుంది. మొదట టిడ్కో ఇళ్లు, సచివాలయాలతో మెుదలైన ఈ వైసీపీ రంగుల పురాణం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. చివరకు ప్రార్థన మందిరలను కూడా వదలరా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.