ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_-dissident_leaders_met

ETV Bharat / videos

ఇంఛార్జ్‌గా మంత్రి ఆదిమూలపు సురేష్‌నే కొనసాగించాలి- రాజీనామాలకు సిద్ధమైన అసమ్మతి నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 8:21 PM IST

Updated : Dec 14, 2023, 9:08 PM IST

YCP Dissident Leaders Met Against In-Charge Appointment: యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్ మార్పును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. భేటీలో భాగంగా ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నాయకులు రాజీనామా పత్రాలను సమర్పించేందుకు సిద్దమయ్యారు. అనంతరం తమ నియోజకవర్గానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో ఏ కొత్త నాయకుడిని ఇంఛార్జ్‌గా నియమించినా, తాము సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

YCP Dissident Leaders Comments: ''యర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ మా నియోజకవర్గానికి 14 సంవత్సరాలుగా ఇంఛార్జ్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ప్రతి గ్రామంలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఆయన ఎంతో ప్రొత్సహించారు. అలాంటి ఎమ్మెల్యేను పార్టీ అధిష్ఠానం కొండపి నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా నియామించింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా సీఎం జగన్, పార్టీ పెద్దలు మరోసారి ఆలోచించి, సురేష్‌ను యర్రగొండపాలెం ఇంఛార్జ్‌గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని వైసీపీ అసమ్మతి నేతలు అన్నారు. 

Last Updated : Dec 14, 2023, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details