YCP Cadre Attacked on Telugu Desam Activist: పలాసలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ కార్యకర్తపై దాడి - తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజశేఖర్ పై దాడి
YCP Cadres Attacked on Telugu Desam Activist: శ్రీకాకుళం జిల్లా పలాసలో మందస మండలం లింబుగాం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజశేఖర్‌పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఓ హోటల్‌లో భోజనం చేస్తూ... రాజశేఖర్, అతని స్నేహితులు తమ అభిమాన నేత గౌతు శిరీష గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తి.. మీది ఏ గ్రామం అని వారిని అడిగాడు. నీవు ఎవరో తెలియదని.. ఐనా మా విషయాలు నీకెందుకని నిలదీశారు. దీంతో వైసీపీ వర్గీయులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాజశేఖర్ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital) తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజు కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని బాధితుడు ఆరోపించాడు. గతంలో సైతం తనపై వైసీపీ నేతలు దాడి చేశారని బాధితుడు పేర్కొన్నారు. ఎదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలనీ.. ఇలా దాడులు చేయడం సరికాదని పేర్కొన్నాడు. తనపై దాడి చేయడమే కాకుండా తన వద్ద ఉన్న 5 వేల రూపాయలు పట్టుకుపోయాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.