TDP leader JaleelKhan on CM ముస్లింలకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: టీడీపీ నేత జలీల్‌ఖాన్ - ముస్లింలకు సీఎం క్షమాపణలు చెప్పాలన్న జలీల్‌ఖాన్
TDP JaleelKhan on YCP Balloons on Masjid: మసీదుమీనార్‌కు వైసీపీ బెలూన్లు కట్టి.. ముస్లిం మతాన్ని అగౌరపరిచినందుకు ముస్లింలకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. అధికారం ఉందనే అహంకారంతో ఇస్లాంను అవమానిస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత, సంస్కారం ఉంటే ఇలాంటి పనులు చేయారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ముస్లిం సమాజం ఆగ్రహావేశాలతో రగిలిపోతోందని ఆయన అన్నారు. నంబూరు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. హజ్ యాత్రికుల్ని మర్యాదగా కూడా పలకరించలేదని జలీల్‌ఖాన్ విమర్శించారు. ముఖ్యమంత్రి 2 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి.. మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారని అని అన్నారు. హాజీలకు కూడా దూరం నుంచే చెయ్యి ఊపి వెళ్లిపోయారని విమర్శించారు. హాజ్ కమిటీ ఆహ్వానంతో అక్కడికి వెళ్లిన చంద్రబాబు.. గౌరవ మర్యాదలతో వ్యవహరించి, ముస్లిం మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారని జలీల్ ఖాన్ తెలిపారు.