ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ycp Attack On Janasena Activists In Tanuku

ETV Bharat / videos

YCP Attack On Janasena Activists: రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. జనసేన కార్యకర్తలపై దాడి - తణుకు తాజా వార్తలు

By

Published : Jul 15, 2023, 3:38 PM IST

Ycp Attack On Janasena Activists In Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ జెండాలు పట్టుకుని వెళ్తున్న జనసైనికులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన స్థానిక రాజకీయాల్లో దూమరం రేపింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తణుకులో నిర్వహించిన బహిరంగ సభకు ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హాజరయ్యారు. సభ ఆనంతరం జనసేన పార్టీ జెండాలు పట్టుకుని ఇద్దరు వ్యక్తులు ఇంటికి బయలుదేరారు. వారు ఇరగవరం సమీపంలోకి చేరుకున్న తర్వాత వీరిని గమనించిన  వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఆనంతరం  కర్రలు, ట్యూబ్‌లైట్లతో దాడిచేశారు. వారిలో ఒకరిని తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  దాడి విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ గుడివాడ రామచంద్రరావు బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై జనసేన కార్యకర్తలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 




 

ABOUT THE AUTHOR

...view details