ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yarlagadda_Venkatrao_Met_Chandrababu

ETV Bharat / videos

Yarlagadda Venkatrao Met Chandrababu: గుడివాడ నుంచైనా పోటీకి సిద్ధం.. చంద్రబాబుతో భేటీ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు - చంద్రబాబును కలిసిన యార్లగడ్డ

By

Published : Aug 20, 2023, 11:56 AM IST

Updated : Aug 20, 2023, 8:16 PM IST

Yarlagadda Venkatrao Met Chandrababu: ఎన్నికలకు ముందే రాష్ట్రంలో రాజకీయాలు కాక మీదున్నాయి. ఎన్టీఆర్​ జిల్లా గన్నవరం నియోజకవర్గం మరి కాస్తా హీట్​ఎక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీలోకి చేరగా.. అదే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు సైకిల్​ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు హైదరాబాద్​లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన యార్లగడ్డ.. టీడీపీలోకి చేరేందుకు తన సమ్మతిని తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. నేటి నుంచి మొత్తం 4 రోజులపాటు గన్నవరం నియోజకవర్గంలోనే యువగళం పాదయాత్ర సాగనుంది. వరుస విజయాలతో గన్నవరం పీఠం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీదే అని చాటేలా ఎల్లుండి లక్షలాది మందితో గన్నవరంలో యువగళం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపటి నుంచి లోకేశ్​ యువగళం పాదయాత్రలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొననున్నారు. కాగా గన్నవరంలో జరిగే భారీ బహిరంగ సభలో నారా లోకేశ్​ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దార్శనికుడని ఆయనతో పని చేయాలనే భేషరతుగా ఆ పార్టీలో చేరనున్నట్లు.. గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. వైకాపాలో తనకు ఎదురైన పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. త్వరలోనే తెలుగుదేశంలో చేరనున్నట్లు.. సమావేశం తర్వాత ప్రకటించారు. పార్టీ చెబితే గుడివాడ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యార్లగడ్డ వెల్లడించారు. 

Last Updated : Aug 20, 2023, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details