Yanam Oldage Home Silver Festival Celebrations: 'యానాం అభివృద్ధిలో మల్లాడి కృష్ణారావు కీలకపాత్ర' : రజతోత్సవాల్లో జేడీ - Yanam Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 12:59 PM IST
Yanam Oldage Home Silver Festival Celebrations: కాకినాడ జిల్లా యానాం అభివృద్ధిలో మల్లాడి కృష్ణారావు కీలకపాత్ర పోషించారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొనియాడారు. యానాం ఓల్డేజ్ హోం రజతోత్సవ వేడుకలను మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. యానాం ప్రజలు విజ్ఞతతో మల్లాడి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. యానాం వృద్ధాశ్రమం ద్వారా 28 రకాల సేవల్ని అందేజేస్తున్నట్లు మల్లాడి కృష్ణారావు వివరించారు.
"ఒక్క ఓల్డేజ్ హోమ్ మాత్రమే కాకుండా.. హార్బర్డ్స్ హోమ్, యానాం స్వచ్ఛంద సంస్థను 2002లో ఏర్పాటు చేశాం. యానాం వృద్ధాశ్రమం ద్వారా 28 రకాల సేవల్ని అందచేస్తున్నాం. ఇలా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయిన వ్యక్తి చివరి ఘట్టం వరకు ఈ వ్యవస్థలను స్థాపించి.. ఈ రోజు యానాం ఓల్డేజ్ హోం రజతోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం." - మల్లాడి కృష్ణారావు, మాజీ మంత్రి