Worst Service Roads in Vijayawada: విజయవాడలో అధ్వానంగా సర్వీస్ రోడ్లు.. గుంతలతో వాహనదారులకు ప్రమాదం.. - AP Roads Damage
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 12:36 PM IST
Worst Service Roads in Vijayawada : బెజవాడ నగరంలో సర్వీసు రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే గుంతలు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సర్వీసు రోడ్లు అధ్వానంగా ఉన్నా పాలకులు మరమ్మతులు కూడా చేయకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Poor Drainage in Vijayawada Roads Damage : విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌కి ఇరు వైపుల ఉన్న సర్వీసు రోడ్డు అధ్వానంగా తయారయ్యింది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ సర్వీసు రోడ్డుపై చిన్నపాటి వర్షానికే రోజుల తరబడి నీరు నిలువ ఉంటోంది. మరో వైపు సర్వీసు రోడ్డుకి ఆనుకొని ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షానికి మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తుంది. ఫ్లై ఓవర్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా సర్వీసు రోడ్డుకు మాత్రం నేటికీ మోక్షం లభించలేదు.
Roads Damage in AP :బెంజ్ సర్కిల్ సర్వీసు రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తరచూ పునరావృతమవుతుంది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుడడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.