అంగన్వాడీ పాలలో పురుగులు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు - YSR Sampurna Poshan Scheme
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 6:12 PM IST
Worms in Milk in Anganwadi Centre at Tirupati District :అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అమలయ్యే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అసంపూర్ణ పోషణగా మారింది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలు చేయబడుతోందని ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం.. పథకాన్ని నాసికరంతో నింపి.. అప్రతిష్టపాలు చేస్తున్నారు. సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం పోలినాయుడు కండ్రిగలో అంగన్ వాడీ కేంద్రం నిర్వాహకులు పంపిణీ చేస్తున్న పాలు నాసిరకంగా ఉండటంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాల ప్యాకెట్లు పూర్తిస్థాయిలో గడ్డ కట్టి.. తెల్లటి పురుగులు తేలుతున్నాయి. జనవరి 14 వరకు వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉన్నప్పటికీ లబ్ధిదారులు తెరచి చూడగా నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. అక్క, చెల్లెమ్మలని ప్రేమలు ఒలకబోసే ప్రతినిధులు.. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల పాలిట శాపంగా మారి.. పోషకాహారం ఇంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారని స్థానికుల ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడి కేంద్రం తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.