WWO First Meeting at Mangalagiri ప్రపంచ చేనేతలను ఏకం చేసే.. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ తొలి భేటీలో ఏం చర్చించారు! - ap latest news
World Weavers Organization First Meeting at Mangalagiri : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చేనేతలను ఏకం చేసేందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడబ్ల్యూఓ) సంస్థను స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి అంజన్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ మొదటి సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన పద్మశాలి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత కార్మికులను మరింత బలోపేతం చేయడానికి ఈ సంస్థను స్థాపించామని డబ్ల్యూడబ్ల్యూఓ సభ్యులు చెప్పారు. వీరికి అవసరమైన సాంకేతికతను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన పద్మశాలి కులస్తులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం పని చేస్తున్న వివిధ రకాల సంస్థలను వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఏకం చేసి మరింత ముందుకు తీసుకెళ్లాలని వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి అంజన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, పోతుల సునీత, హనుమంతరావు, ఎల్.రమణ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింక విజయలక్ష్మి పాల్గొన్నారు.