World Space Week celebrations in Visakhapatnam: విశాఖలో నేటి నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు.. - విశాఖపట్నం జిల్లా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 12:08 PM IST
World Space Week celebrations in Visakhapatnam: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో)ల ఆధ్వర్యంలో విశాఖలోని రఘు ఇంజనీరింగ్ కళాశాల వేదికగా.. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నాలుగు రోజులు పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు.. రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు.. షార్ శాస్త్రవేత్త, విశాఖ రీజియన్ కార్యక్రమాల నిర్వహణ సబ్ కమిటీ చైర్మన్ జి.అప్పన్నలు వారోత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానం, పరిశోధనలపై ఆసక్తి పెంపొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని వారు తెలిపారు. ప్రదర్శనకు పెట్టిన వాటి గురించి తెలియజేయడానికి.. 20 మంది శాస్త్రవేత్తలు ఆయా కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. ఈ నెల 5 నుంచి 8 తేదీ వరకు రఘు కళాశాలలో జరిగే ‘స్పేస్ ఎగ్జిబిషన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి రోజు దాదాపు 3 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు’వారు తెలిపారు. చంద్రయాన్-3, ఆదిత్య-1.1కు సంబంధించిన రాకెట్ మోడల్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.