workers protest in gangavaram port : సీఎం పాలన చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా?: కొల్లు రవీంద్ర - తెలుగు దేశం పార్టీ
workers protest in gangavaram : విశాఖ పట్నం గాజువాక అదానీ గంగవరం పోర్టు కార్మికులకు మాజీ మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పది రోజులుగా నిరవధిక దీక్షలుచేస్తున్న గంగవరం పోర్ట్ కార్మికులను పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? అని కొల్లు రవీంద్ర విమర్శించారు. గంగపుత్రులను రోడ్డును పడేస్తే ఊరుకునేది లేదని అదానీ యాజమాన్యాన్ని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంగపుత్రులు వారి హక్కులని అడిగారే కానీ అదానీ ఆస్తులను కాదు కదా అని రవీంద్ర అన్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, మంత్రి గంగపుత్రులకు ఎందుకు సంఘీభావం తెలపకుండా అదానీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారో సమాధానం చెప్పాలని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులకు.. బేసిక్ పేను 22వేలు చేసి కనీస వేతనం 36వేలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతన ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని అన్నారు.