ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Work_Inspector_Suicide_Attempt_in_Sand_Dispute

ETV Bharat / videos

ఇసుక గోల్​మాల్​పై అధికారుల సమీక్ష - ఆత్మహత్యకు యత్నించిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్ - Argument between officials in Rayachoti

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 7:50 PM IST

Work Inspector Suicide Attempt in Sand Dispute : ఇసుక వివాదంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్ కలెక్టరేట్​లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రాయచోటి జగనన్న కాలనీకి గృహ నిర్మాణ శాఖ ఇసుకను సరఫరా చేస్తుంది. ఈ ఇసుకను అధికారులే పక్కదారి పట్టించారనే ఆరోపణ ఉంది. దీనిపై జిల్లా కలెక్టరేట్​లోని హౌసింగ్ పీడీ కార్యాలయంలో అధికారులు సమీక్షించారు. ఇసుక గోల్ మాల్ పై చర్చ సందర్భంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీహరి, రమేష్ నాయక్​ మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈ సందర్భంలోనే రమేష్ నాయక్ పై అధికారుల సమక్షంలోనే శ్రీహరి దాడికి యత్నించాడు. శ్రీహరి ఇసుక గోల్ మాల్ వ్యవహారం బయటికి రావడంతోనే తనపై దాడి చేశారని రమేష్ నాయక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్​కే అధికారులు వత్తాసు పలికారని రమేష్ వాపోయాడు. తనకు జరిగిన అవమానం భరించలేక కలెక్టరేట్​లోనే పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పెట్రోల్ సీసాను లాగేసుకుని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై రమేష్ నాయక్ దంపతులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details