ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Women_Suicide_in_Konaseema_District

ETV Bharat / videos

పెట్రోలు పోసుకుని మహిళ ఆత్మహత్య - ఆ కారణంగానే! - ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 9:44 AM IST

Women Suicide in Konaseema District: దీపావళి పండుగ పూట కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు.

Women Suicide Case: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన ఆదినారాయణ.. లూజు పెట్రోలు అమ్ముతూ జీవిస్తున్నారు. అతడికి భార్య మంగాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంట్లో కలహాలతో.. భార్య మంగాదేవీ శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు(Woman Commits Suicide). భర్త, కుమారుడు.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. భర్త, కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో గాయాలపాలైన వారిని.. స్థానికులు కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details