Women Protest For Water on Road : 'మా గ్రామం ఉన్నట్టయినా గుర్తుందా..' అధికారులపై గ్రామస్థుల ఆగ్రహానికి కారణమేంటంటే..?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 5:08 PM IST
Women Protest For Water On Road At Sri Sathyasai District : వేసవి రాకముందే ఆ గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. వంటింటి అవసరాలకు కూడా మైళ్ల దూరం ప్రయాణిస్తే గానీ పనులు చేసుకోలేని పరిస్థితి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంట్లో వారంతా బిందెలు పట్టుకొని నీళ్లు మోసుకోవాల్సిందే.. ఈ దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు ఎస్.ఎస్. గుండ్ల గ్రామస్థులు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఎస్.ఎస్. గుండ్ల గ్రామంలో నీటి సమస్య ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.
Drinking Water Problem In SS Gundla Village : తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లోకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న బోరు బావిలో మోటర్లు చెడిపోయినా పంచాయతీ సర్పంచ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్థులు వారి వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. మా గ్రామం ఉన్నట్లైనా గుర్తుందా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి నాయకులు గ్రామంలోకి వస్తే తగినబుద్ది చెబుతామని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
TAGGED:
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు