ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Women protest demands closure of liquor shop

ETV Bharat / videos

Women Protest Demands Closure of Liquor Shop: వైన్​ షాప్​ తొలగించాలంటూ మహిళల నిరసన.. 15 రోజుల గడువు కోరిన ఎమ్మెల్యే - news on MLA Botsa Appala narasayya in Gadapa

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 5:13 PM IST

Women protest demands closure of liquor shop: గడప గడపకు మనప్రభుత్వం అంటూ ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. తమ గ్రామంలో వైన్ షాప్​ను తొలగించాలని ఎమ్మెల్యే ముందు మహిళలు ఆందోళనకు దిగారు. మహిళల ఆందోళనకు తలొగ్గిన ఎమ్మెల్యే... వైన్ షాప్​ను తరలించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లిలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి వస్తున్నారని తెలిసి వైన్ షాపు ముందు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ గ్రామం మద్యలో వైన్ షాపు వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, తక్షణమే తమ గ్రామం మద్యలో ఉన్న వైన్ షాపు ను తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

వైన్ షాప్​ వల్ల సాయంత్రం బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మహిళలు తెలిపారు. తక్షణమే మద్యం దుకాణం తొలగించాలంటూ  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మరుపల్లి వచ్చిన ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యకు మహిళలు తమ గోడు వెలిబుచ్చారు. మహిళల డిమాండ్​పై సానుకూలంగా స్పందించిన అప్పలనర్సయ్య.. 15 రోజుల్లో గ్రామంలో ఉన్న వైన్ షాపు తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరలోనే  సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే హామీతో గ్రామంలోని మహిళలు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details