ధర్మాన సభలో మహిళలకు తప్పని పాట్లు.. బయటికి రాలేక.. లోపలికి వెళ్లలేక..! - ఆసరా నిధుల పంపిణీ సమావేశం
WOMEN PROBLEMS AT DHARMANA MEETING : మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశానికి హాజరైన మహిళలు పడరాని పాట్లు పడ్డారు. శ్రీకాకుళం PSNM పాఠశాలలో.. ఆసరా నిధుల పంపిణీ సమావేశం ఏర్పాటు చేశారు. సభకు మంత్రి ధర్మాన వస్తున్నారని,.. అందరూ విధిగా రావాలంటూ డ్వాక్రా సంఘాలకు స్పష్టం చేశారు. ఆ మేరకు నిర్ణీత సమయానికి కొందరు చేరుకోగా.. మరికొందరు ఆలస్యంగా వచ్చారు. ఐతే నిర్ణీత సమయానికి పాఠశాల గేటుకు తాళం వేశారు. ఇక సమావేశం ముగిసేదాకా బయటి వారిని లోపలికి పంపలేదు, లోపలివారిని బయటకు పంపలేదు. చేసేదేమీ లేక మహిళలు గోడలు దూకి వెళ్లాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో ధర్మాన దురుసు మాటలతో.. అధికారులు గేట్లకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు పడరాని పాట్లు పడ్డారు. ఈ సమావేశమే కాదు.. ఈ మధ్య కాలంలో ఆసరా పథకం పంపిణీ కార్యక్రమంలో చాలాసార్లు ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. దీంతో మహిళల బాధలు వర్ణనాతీతం..