ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకినాడ ఆరుద్ర

ETV Bharat / videos

Arudra Protest: పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ.. దివ్యాంగురాలైన కుమార్తెతో తల్లి నిరసన - ఆంధ్రప్రదేశ్ వార్తలు

By

Published : May 29, 2023, 7:48 PM IST

Kakinada Women Arudra Protest: తన కుమార్తె దుస్థితికి కారణమైన అన్నవరం పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆరుద్ర అనే మహిళ దివ్యాంగ సంఘాల సహకారంతో కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. గతంలోనూ దివ్యాంగురాలైన కుమార్తెకు న్యాయం చేయాలంటూ ఆమె కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. ప్రస్తుతం కుమార్తె దుస్థితి గురించి చెప్పుకుందామని సీఎంని, చంద్రబాబును కలవాలని ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

అన్నవరం పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని గతంలో ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. సీఎం దగ్గరకి వెళ్లినా తనకు స్పందన సరిగ్గా రాలేదని ఆరుద్ర చెప్తున్నారు. తమని పోలీసులు వేదిస్తున్నారని.. పోలీసుల నుంచి రక్షించాలని కోరారు. దివ్యాంగురాలైన కుమార్తెతో కలిసి గతంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆరుద్ర నిరసన చేపట్టారు. ఎవరినీ కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరుద్ర వాపోయారు. కుమార్తె ఆరోగ్యం కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నానని.. అయినా సరే తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. 

ABOUT THE AUTHOR

...view details