ఆంధ్రప్రదేశ్

andhra pradesh

woman_escape-_with_12_crores_of_police_money

ETV Bharat / videos

అధిక వడ్డీ ఆశిస్తే ₹12కోట్లతో ఉడాయించిన మహిళ - బాధితులంతా పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలే - గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 1:01 PM IST

Woman Escape With 12 Crores Of Police Money: గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన శ్రీదేవి అనే మహిళ 12 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఆక్టోపస్, ఆరో బెటాలియన్​కు చెందిన సిబ్బంది వద్ద 2016 నుంచి శ్రీదేవి చిట్టీలు నిర్వహిస్తుంది. ఈమె వద్దే చిట్టీ పాటలు పాడుకొని మళ్లీ ఆమెకే కానిస్టేబుల్​ భార్యలు వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. 70మంది పోలీస్ కానిస్టేబుల్​ భార్యల నుంచి సుమారు 12 కోట్లు వరకు వసూలు చేసి మొత్తం తీసుకుని రాత్రికి రాత్రే పరారైందని తెలిపారు. వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఆరో బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్ భార్య సుష్మకుమారి రిపోర్టు ఇచ్చారు. శ్రీదేవి దగ్గర చిట్టీలు వేసి అందరం మోసపోయామని తెలిపారు. దాదాపు 60 నుంచి 70మంది పోలీసుల వరకు నష్టపోయారు. శ్రీదేవిని డబ్బులు అడుగుతుంటే ఇచ్చేస్తానంటూ మాయ మాటలు చెప్పి పరారైంది. సుమారు 10-12కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. - క్రాంతి కిరణ్, ఎస్సై, మంగళగిరి

ABOUT THE AUTHOR

...view details