family planning operation కు.ని ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు - తెలుగు తాజా
family planning operation : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన మహిళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వికటించి మృతిచెందింది. కుంటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భట్రుపాలెం గ్రామానికి చెందిన కేలావత్ నందినిబాయ్ దాచేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది. అనంతరం వైద్యులు ఇంటికి వెళ్లమనడంతో ఆమెను కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకెళ్లారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికి ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో దాచేపల్లి పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పిడుగురాళ్ల వెళ్లమని చెప్పారు. హుటాహుటిన ప్రైవేటు అంబులెన్స్‌లో ఆమెను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మరణించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ దాచేపల్లి ప్రభుత్వ వైద్యశాల ముందు కుంటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాంతో నిరసన తెలిపారు. నందినిబాయ్‌కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.