నిద్రపోతున్న భర్త గొంతుకు చున్నీ బిగించి చంపేసిన మహిళా వాలంటీర్ - crime news prakasam district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 3:50 PM IST
|Updated : Dec 9, 2023, 7:34 PM IST
Wife Who Killed Her Husband : కుటుంబ కలహాల కారణంగా భర్త గొంతుకు చున్నీ బిగించి చంపేసిన భార్య. ఈ సంఘటన ఒంగోలులో వెలుగుచూసింది. మద్దిరాలపాడులో వాలంటీర్‌గా పనిచేస్తున్న అశ్విని, పెయింటర్‌గా పనిచేస్తున్న తన భర్త మల్లికార్జున గొంతుకు చున్నీ బిగించి చంపేసింది. ఒంగోలు సీతారామపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వీరి ఇద్దరి మధ్య శుక్రవారం (డిసెంబరు 8న) రాత్రి ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్లికార్జునను అశ్విని హత్య చేసి ఉంటుందని మృతుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అశ్వినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Children Who Lost Their Father : మల్లికార్జున, అశ్విని దంపతులకు ఇద్దరు సంతానం. దంపతుల మధ్య ఘర్షణల కారణంగా ఇద్దరు పిల్లలు మల్లికార్జున తల్లిదండ్రుల వద్జ పెరుగుతున్నారు. ఒకవైపు చేతికందిన కొడుకు కోల్పోయిన తల్లిదండ్రులు, మరోవైపు తండ్రి కోల్పోయిన పిల్లలు శోకం సంద్రంలో మునిగిపోయారు. వారి పరిస్థితి చూసి స్థానికుల మనసు కలచివేసింది.
"ఈ రోజు ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం నగరంలో భార్య భర్తను చంపిన సమాచారం మాకు అందింది. నిందితురాలు దర్శి అశ్విని పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. ఆమె వాలంటీర్‌గా మద్దిరాలపాడులో పనిచేస్తుంది. భర్త మల్లికార్జున పేయింటర్గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా ఆమెపై భర్తకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో మద్దిరాలపాడు నుంచి ఒంగోలుకు ఫ్యామిలీ మారింది. అక్కడ కూడా ఆమెకు ప్రతిరోజు వేధింపులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి సుమారు ఒకటి, రెండు గంటల పాటు గొడవ పడ్డారు. అనంతరం నిద్రిస్తున్న భర్తను చున్నీతో అతని మెడకు వేసి, లాగేడం ద్వారా శ్వాస ఆడక అతడు చనిపోవడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము" - సీఐ లక్ష్మణ్