ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Whip Kapu Comments Viral

ETV Bharat / videos

Kapu Ramachandra Reddy Comments Viral: గడప గడపలో కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం.. సమస్యలు చెబితే.. - ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి

By

Published : Jun 1, 2023, 3:36 PM IST

Whip Kapu Ramachandra Reddy Comments: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ప్రశ్నలు రావడం సాధారణం. ప్రజలు అడిగిన ప్రశ్నలకు చాలా మంది నాయకులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోతారు. మరికొందరు అడిగిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతారు. తాజాగా ఇప్పుడు జరిగిన సంఘటన అంతకుమించి అన్నట్లు ఉంది.  

ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా బొమ్మనహాళ్​ మండలం గోవిందవాడలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలు ప్రస్తావించిన గ్రామస్థులపై పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీల్లో ప్రతినెలా రేషన్​ ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని, సంవత్సరాల తరబడి తమ ఆధీనంలో ఉన్న పశువుల పాకను నాయకులు ఆక్రమించుకున్నారని.. కాపు రామచంద్రారెడ్డి ఎదుట గ్రామస్థులు ఆందోళన వెలిబుచ్చారు. నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన రామచంద్రారెడ్డి.. సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా అంటూ దూషించారు. పక్కనే ఉన్న పోలీసు కల్పించుకుని కేసులు పెడతామంటూ గ్రామస్థులను బెదిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు సర్దిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details