ఆంధ్రప్రదేశ్

andhra pradesh

welfare-group-of-society-agents-take-protest

ETV Bharat / videos

Welfare Group Society Agents Protest in Visakha: వెల్ఫేర్ గ్రూప్ వడ్డీ స్కీం మోసాలు.. విశాఖలో రోడ్డెక్కిన ఏజెంట్లు - ఏపీ వెల్ఫేర్ గ్రూప్ బ్రాంచీలపై కేసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 6:05 PM IST

Welfare Group Society Agents Protest in Visakha: వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సొసైటీ చైర్మన్ మళ్ల విజయ్ ప్రసాద్ తమను నిలువునా ముంచేసారని వెల్ఫేర్ గ్రూప్ ఏజెంట్లు విశాఖలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధిక వడ్డీ స్కీం పేరుతో నెల నెలా కొంత డబ్బు కడితే మెచ్యూరిటీ తర్వాత మొత్తం డబ్బులు ఇచ్చేస్తామని ఆశ చూపాడని బాధితులు పేర్కొన్నారు. అతని మాటలు నమ్మి ఏజెంట్లు వేలాది మంది ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. అయితే మెచ్యూరిటీ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు కట్టిన ప్రజలు ఏజెంట్లను అడగడం మొదలుపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. నెల్లూరు నుంచి వచ్చిన సుమారు 40 మంది ఏజెంట్లు విశాఖలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

మళ్ల విజయప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా అనేక వెల్ఫేర్ గ్రూప్ బ్రాంచీలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేశారని ఏజెంట్లు ఆరోపించారు. డబ్బులు కట్టిన ప్రజలకు తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఏజెంట్లు మండిపడ్డారు. మెచ్యూరిటీ తరువాత డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు కట్టిన ప్రజలు తమను డబ్బులు ఇవ్వాలని వేదిస్తున్నారని ఏజెంట్లు వాపోయారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details